Aug 09,2023 22:08

            పాలకోడేరు :ఎంపీ, వైసిపి జిల్లా కో-ఆర్డినేటర్‌ మిథున్‌ రెడ్డిని వైసిపి ముఖ్య నేత, గొరగనమూడి గ్రామానికి చెందిన బల్లా పరమేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన పరమేశ్వరరావు ఆక్కడికి వచ్చిన మిథున్‌రెడ్డి , రాజమండ్రి ఎంపీ భరత్‌లను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ప్రభు త్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి, పార్టీ స్థితిగతుల గురించి పరమేశ్వరరావును వారు అడిగి తెలుసు కున్నారు.