Jul 07,2023 19:26

సమావేశంలో మాట్లాడుతున్న డీన్‌ డాక్టర్‌ యింగ్‌హురు

ప్రజాశక్తి-కురబలకోట: ప్రపంచ దిగ్గజ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన తైవాన్‌లోని ఆసియా విశ్వవిద్యాలయ డీన్‌లు ఐదుగురు శుక్రవారం మిట్స్‌ కళాశాలను సందర్శించారు. ఇంటర్నేషనల్‌ కాలేజీ డీన్‌ డాక్టర్‌ యింగ్‌హురు, కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సైన్సెస్‌ డీన్‌ డాక్టర్‌ చింగ్‌-హీన్‌హ్సు, కాలేజ్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్‌మేన్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డీన్‌ డాక్టర్‌ చున్‌-వీలిన్‌, కాలేజ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ డీన్‌ డాక్టర్‌ చార్లెస్‌ సిఎస్‌, ఇండిస్టీ అకాడమీ సహకార డీన్‌ వాంగ్‌ తదితరులు కళాశాలలో అకడమిక్‌ ఎక్స్‌లెన్స్‌ ఇంటర్నిషిప్‌లు, సహకార కార్యకలాపాలు, ఎంఎస్‌తో సహా ఇతర వర్చువల్‌ కార్యకలాపాలపై కళాశాలలో డీన్‌లతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ యువరాజ్‌ మాట్లాడుతూ ఆసియా యూనివర్సిటీ- తైవాన్‌కు మిట్స్‌ కళాశాలకు ఇది వరకు ఉన్న ఎంఒయుని పునరుద్ధరించారని పేర్కొన్నారు. తదుపరి విద్యా సహకారం కోసం కాలేజ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌తో ఒప్పందంపై సంతకం చేసారని చెప్పారు. ఆసియా యూనివర్శిటీ యొక్క కాలేజ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకుందన్నారు. మిట్స్‌ ఎంబిఎ విభాగంతో ఎంఒయు కుదుర్చికుందని తెలిపారు. ఇంటర్నేషనల్‌ కాలేజీ డీన్‌ డాక్టర్‌ యింగ్‌హురు మాట్లాడుతూ తమ యూనివర్సిటీలో ఇదివరికే మిట్స్‌ కలశాల నుంచి 25 మంది విద్యార్థులు ఎంఎస్‌ డిగ్రీలు చేశారని, ఇప్పటికి ముగ్గురు విద్యార్థులు పిహెచ్‌డిలు చేస్తున్నారని, మిట్స్‌ కళాశాల నుంచి మెరిట్‌ విద్యార్థులను ఆసియా యూనివర్సిటీకు పంపి వారి ఉన్నత చదువులకు సహకరించిన మిట్స్‌ కళాశాల కరెస్పాండంట్‌ డాక్టర్‌ విజయ భాస్కర్‌ చౌదరికి అభినందనలు తెలియజేసారు. ఆసియా యూనివర్సిటీ, తైవాన్‌ నుంచి స్టూడెంట్‌, ఫ్యాకల్టీ ఎక్సేంజ్‌ ప్రోగ్రాం, ఇంటర్నిషిప్‌కు పూర్తి సహకారం అందజేస్తామని, పరిశోధనల పరంగా మిట్స్‌, ఆసియా యూనివర్సిటీలు కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ఇంటర్నేషనల్‌ డీన్‌ డాక్టర్‌ శ్రీమంతబసు, సీనియర్‌ మేనేజర్‌ యు.విజయ లక్ష్మి, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రామనాథన్‌, డాక్టర్‌ కమల్‌ బాషా పాల్గొన్నారు.