ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : మిస్టర్ ప్రెగెంట్ చిత్రాన్ని ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళా ప్రేక్షుకులు ఎంతో ఆదరిస్తున్నారని ఆ చిత్ర హీరో సోహెల్ అన్నారు. మహిళలు 9 నెలలపాటు గర్భం ధరించినప్పుడు పడే బాధని ఈ చిత్రం ద్వారా తెలియచేశామని చెప్పారు. మంచి సినిమాలను విజయవాడ ప్రేక్షుకులు ఎప్పుడు ఆదరిస్తారని ఈ చిత్రంతో మరోసారి రుజువైందని ఆయన వెల్లడించారు. మిస్టర్ ప్రెగెంట్ చిత్ర బందం విజయవాడలో సందడి చేసింది. చిత్రం విజయోత్సవంలో భాగంగా గవర్నర్‌పేటలోని ఒక హోటల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో సోహెల్, దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సోహెల్ మాట్లాడుతూ ప్రెగెంట్ చిత్రానికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. మహిళలు 9 నెలలపాటు గర్భం ధరించినప్పుడు పడే బాధని ఈ చిత్రం ద్వారా తెలియచేశామని ప్రేక్షుకులు ఎంతగానో ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షుకులు ఆదరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విడుదలైన అన్ని సెంటర్లలో మంచి స్పందన లభించిందన్నారు. త్వరలో బూత్ కట్ బాలరాజు చిత్రంతో నేను ప్రేక్షకులు ముందుకి రానున్నట్లు తెలిపారు. విలన్ పాత్రలను సైతం చేయడానికి తాను సిద్ధంగా వున్నానని స్పష్టం చేశారు. అనంతరం దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి, నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని విజయవాడ ప్రేక్షుకులు బాగా ఆదరిస్తున్నారని చెప్పారు. ఒక గొప్పదైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చామని పేర్కొన్నారు. ఛాలెంజింగ్ క్యారెక్టర్‌లో సోహెల్ అద్భుతంగా నటించారని వారు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో నిర్మాత అప్పిరెడ్డి, నటుడు మబ్బుల్ పాల్గొన్నారు.










