'మిషన్ రాయలసీమ' కరపత్రాల పంపిణీ
తిరుపతి(మంగళం): రాయలసీమ ప్రాంతపు సమస్యలు పరిష్కారం చేయడానికి, జీవనం అభివద్ధి బాట పట్టించేందుకు హామీ ఇస్తూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా మిషన్ రాయలసీమను ప్రకటించారని తిరుపతి మాజీ శాసన సభ్యురాలు సుగుణమ్మ అన్నారు. బుధవారం తిరుపతి నగర పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలి పరిసర ప్రాంతాలలో తెలుగు యువత నాయకులతో కలిసి మిషన్ రాయలసీమ ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత నాయకులు ఆర్పి శ్రీనివాస్, మధుబాబు శ్రీనివాస యాదవ్, కరణం సందీప్ పాల్గొన్నారు.










