
ప్రజాశక్తి వార్తకు స్పందన
ముసునూరు : మిర్చి రైతుల సమస్యలపై 'మిర్చికి తెగుళ్లు బెడద' అనే శీర్షికతో ప్రజాశక్తిలో వచ్చిన వార్తకు ఉద్యానవన శాకాధికారి కె.జ్యోతి ప్రియాంక స్పందించి మండలంలోని వలసపల్లి గ్రామంలో తమ సిబ్బందితో కలిసి మిర్చి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట నారు నాటే సమయంలో ఇమిడా క్లో ప్రిడ్ అనే మందు నారుపై పిచికారీ చేయాలని, అదేవిధంగా బొబ్బర తెగులు రాకుండా వుండేందకు ముందు జాగ్రత్త చర్యగా పసుపు అట్టలను ఎకరానికి పది నుంచి పన్నేండు అట్టలను పొలంలో వేలాడి తీస్తే జిగురుకు పురుగు నశిస్తుందని తెలిపారు.