
రైతులతో మాట్లాడుతున్న జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపిచంద్
ప్రజాశక్తి-యర్రగొండపాలెం : మండల పరిధిలోని గురిజేపల్లి, బోయలపల్లి, కొలుకుల, వీరభద్రాపురం గ్రామాల్లో సాగులో చేసిన మిరప పంటలను జిల్లా ఉద్యాన శాఖ అధికారి వై.గోపిచంద్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గోపిచంద్ మాట్లాడుతూ ఈ-క్రాప్ నమోదు ప్రకారం యర్రగొండపాలెం మండలంలో గతేడాది కంటే 3,000 ఎకరాల్లో అదనంగా మిర్చి సాగు చేసినట్లు తెలిపారు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో మిర్చిలో సూక్ష్మ పోషకాల లోపం ఎక్కువగా ఉందన్నారు. 19:19:19, ఫార్ములా 4 కలిపి పిచికారీ చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి పి. ఆదిరెడ్డి, ఉద్యాన సహాయకులు, రైతులు పాల్గొన్నారు.