మినుము పంటను పరిశీలిస్తున్న మండల వ్యవసాయాధికారి రాము
ప్రజాశక్తి-కందుకూరు : మండలంలోని చుట్టుగుంట రైతు కండ్రా మాలకొండయ్య మినుము పొలాన్ని మండల వ్యవసాయాధికారి వి రాము పోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మినుము పంటకు సీతాఫలం తెగులు ఆసించిందన్నారు. తెగులు సోకిన ఆకులు ముడుతలుగా ఏర్పడి మందంగా, పెద్దవిగా పెరుగుతాయన్నారు. నివారణకు లీటరు నీటికి 2మి. లీ డైమితోయెట్ లేదా 1.5మీ. లీ. మోనోక్రోటోఫోస్ కలిపి పిచికారి చేయాలని సూచించారు. ఇన్‌ఛార్జి గ్రామ వ్యవసాయ సహాయకులు శరత్ కుమార్ పాల్గొన్నారు.










