Mar 02,2023 00:02

ప్లాంట్‌ ను ప్రారంభిస్తున్న కంపెనీ ప్రతినిధులు

ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని ఉపమాక పంచాయతీ శివారు అయ్యన్నపాలెంలో హెటిరో డ్రగ్స్‌ కంపెనీ సౌజన్యంతో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. బుధవారం కంపెనీ ప్రతినిధులు ఎం.ప్రభాకర్‌, ఎం. సుబ్బారెడ్డి, ఎస్‌.కుల్లాయిరెడ్డి చేతుల మీదుగా ఆర్వో ప్లాంట్‌ ను ప్రారంభించారు. గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను తమ దృష్టికి తీసుకు రావడంతో 13 లక్షల రూపాయలతో వాటర్‌ ప్లాంట్‌ ను ఏర్పాటు చేయడం జరిగిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. .సిఎస్‌ఆర్‌ ఫండ్స్‌తో గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జానకయ్యపేట మాజీ సర్పంచ్‌ కురుందాసు నూకరాజు, సెక్యూరిటీ డిపార్ట్మెంట్‌ మూర్తి, హెటిరో సిబ్బంది శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.