ప్రజాశక్తి - ఏలూరు
రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన ప్రధాని మోడీకి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అర్హత లేదని వామపక్ష నాయకులు అన్నారు. ప్రధాని మోడీ విశాఖ పర్యటనను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ కూడలి వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ అధికార ప్రతినిధి యు.వెంకటేశ్వరరావు (యువి), సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పళ్లెం కిషోర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం, మోసం, ద్రోహం చేస్తుందని విమర్శించారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్ కేసుల నుంచి తనను తాను కాపాడుకోవ డానికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నార న్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సిపిఎం నాయకులు బి.సోమయ్య, కె.శ్రీనివాస్, పి.ఆదిశేషు, బి.జగన్నాధం, సాయిబాబా, కోటేశ్వరరావు, గోపి పాల్గొన్నారు. సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ పాల్గొన్నారు.
చింతలపూడి : రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన ప్రధాని మోడీకి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అర్హత లేదని సిపిఎం చింతలపూడి కన్వీనర్ ఆర్‌విఎస్.నారాయణ, సిపిఐ సీనియర్ నాయకులు వసంతరావు అన్నారు. పట్టణంలో ప్రధాని మోడీ విశాఖ పర్యటనను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో స్థానిక పాతబస్టాండ్ కూడలి వద్ద శుక్రవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోడీ ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ కేంద్రంగా వాల్తేరు రైల్వే డివిజన్, వెనుకబడిన ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు పూర్తి తదితర అంశాలపై వాగ్దానం చేసి అధికారం చేపట్టి ఎనిమిదేళ్లు గడిచినా హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి టి.బాబు, సిపిఎం నాయకులు ఎస్.సూర్యకూమర్, గురవయ్య, దొంత కృష్ణ పాల్గొన్నారు.
జంగారెడ్డగూడెం : విశాఖపట్నంలో మోడీ పర్యటనకు వ్యతిరేకంగా జంగారెడ్డిగూడెం ఆర్‌డిఒ కార్యాలయం వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఎం.జీవరత్నం, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కెవి.రమణ, సిపిఐ మండల కార్యదర్శి జంపన వెంకట రమణరాజు, ఎంసిపిఐయు నాయకులు అప్పలరాజులు మాట్లాడారు. అనంతరం ఆర్‌డిఒ ఝాన్సీరాణికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌కె.సుభాషిని, ఐఎఫ్‌టియు డివిజన్ నాయకులు, డివైఎఫ్‌ఐ నాయకులు, పిఒడబ్ల్యు నాయకులు, పిడిఎస్‌యు నాయకులు పాల్గొన్నారు.
వేలేరుపాడు : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన రాకను వ్యతిరేకిస్తూ సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సన్నేపల్లి సాయిబాబు, మండల కార్యదర్శి బాడిశ రాము, రామవరం సర్పంచి పిట్ట ప్రసాద్, జిల్లా కౌన్సిల్ సభ్యులు పిట్ట వీరయ్య, మడివి కామయ్య, మహిళా సమైక్య నాయకులు పాల్గొన్నారు.
నూజివీడు : విశాఖలో మోడీ పర్యటనకు నిరసనగా నూజివీడులో సిపిఐ, సిపిఐ(ఎం), ఎఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో పెద్ద ఎత్తున మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు చలసాని వెంకట రామారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వరరావు, సిపిఐ పట్టణ కార్యదర్శి చాట్ల పుల్లారావు, సిపిఎం నాయకులు జి.రాజు, నిమ్మగడ్డ నరసింహ, మరియదాసు, రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు, అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి శిఖా ఆకాష్, ఎఐటియుసి, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
కొయ్యలగూడెం : కొయ్యలగూడెం ప్రధాన సెంటర్‌లో సిపిఐ కొయ్యలగూడెం మండల కార్యదర్శి జమ్మి శ్రీనివాసరావు ఆధ్వ ర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలతో నిరుపేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికైనా పేద, మధ్యతరగతి ప్రజలను నరేంద్ర మోడీ గుర్తు చేసుకుని వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఎస్‌కె.బాజీ, సీనియర్ నాయకులు నారాయణరావు, వి.నాని, ఎస్.గిరి, కోరుకొల్లు నాగరాజు, చంద్రశేఖర్, ఎం.రామకృష్ణ, నర్సయ్య, పండు, పత్తిపాటి గంగరాజు, వెంకటేష్, గోపి, రాంబాబు, చింతలపూడి దుర్గారావు, గోపాలం పాల్గొన్నారు.










