ప్రజాశక్తి -సీలేరు
జీకే వీధి మండలం సీలేరులో మినీ బసు డిపో ఏర్పాటు జిల్లా ఆర్టీసీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు అధికారి ఆర్‌ఎస్.నాయుడు, రీజినల్ సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ శుక్రవారం స్థల పరిశీలన చేశారు. మినీ బస్ డిపో ఏర్పాటు చేయటానికి 5 ఎకరాలు స్థలం కావలసి ఉంది. దీంతో ముందుగా శివాలయం సమీపంలో ఉన్న గ్యాస్ గొడౌన్ పక్కన , ప్రభుత్వ ఆసుపత్రి, సీలేరు ఐటి సమీపంలో ఉన్న స్థలాన్ని పరిశీలించారు. డిపో నిర్మాణం చేపడితే సుమారు 30 బస్సులు నిలుపుదల చేయడానికి కాంప్లెక్స్, బస్సులు మరమ్మతులకు గ్యారేజీ, అధికారులకు కార్యాలయాలు నిర్మించేందుకు అనువుగా ఉండే స్థలాన్ని పరిశీలించారు. స్థల పరిశీల అనంతరం నివేదికను జిల్లా కలెక్టర్ అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ ఆర్‌విఆర్.రాజు, డివివి.నర్సింగరావు, ఏపీ జెన్కో క్యాంప్ ఏడిఈ అప్పలనాయుడు, ఏఇ సురేష్, స్థానిక ఎంపిటిసి పిల్ల సాంబమూర్తి, ఉప సర్పంచ్ వల్లి ప్రసాద్, వైసిపి నాయకులు వెంకట్రావు, మండి చంద్రయ్య, బుజ్జి, సత్తిబాబు పాల్గొన్నారు.










