మినీ బైపాస్ వైపే వాహనాలు వెళ్లాలి: సీఐ
ప్రజాశక్తి - గూడూరు రూరల్ : పంబలేరు బ్రిడ్జి నిర్మాణం కారణంగా గూడూరు నుండి నెల్లూరు కు సాదుపేట వైపు వెళ్లడానికి వాహనా లకు అనుమతి లేదని మినీ బైపాస్ పై వాహనాలు వెళ్లాలని ఆదిశంకర కాలేజీ నుండి పట్టణంలోకి వచ్చేవాళ్లు రాంగ్ రూట్ లో ప్రయాణిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని గూడూరు రూరల్ సి ఐ దశరధ రామారావు హెచ్చరించారు. పంబ లేరు చప్టాపై నూతన బ్రిడ్జి నిర్మాణం కారణంగా సాదుపేట వైపు నెల్లూరు వెళ్లేందుకు వాహనాలను మినీ బైపాస్ వైపు దారి మళ్లించారు. ఈ సందర్భంగా రూరల్ సి.ఐ దశరథ రామారావు తన కార్యాలయంలో మాట్లాడుతూ నెల్లూరు వైపు వెళ్లేందుకు వాహనాలను మినీ బైపాస్ వైపు దారి మళ్లించామని అయితే ఆదిశంకర కాలేజ్ నుంచి గూడూరు వైపు వచ్చేవాళ్లు రాంగ్ రూట్లో వచ్చి మినీ బైపాస్ వైపు వెళ్తుతున్నారని దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. రాంగ్ రూట్లో వచ్చే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
గూడూరు రూరల్ సి ఐ దశరధ రామారావు










