Sep 28,2023 00:18

మినీ బైపాస్‌ రోడ్‌కు అంబేద్కర్‌ సర్కిల్‌ పేరు పెట్టాలి

మినీ బైపాస్‌ రోడ్‌కు అంబేద్కర్‌ సర్కిల్‌ పేరు పెట్టాలి
ప్రజాశక్తి -పుంగనూరు: పుంగనూరు పట్టణంలో ఉన్న మినీ బైపాస్‌ రోడ్డుకు డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ గా నామకరణం చేయాలని మాల మహానాడు రాష్ట్ర నేత ఎన్‌ ఆర్‌ అశోక్‌ కోరారు. స్థానిక అంబేద్కర్‌ సర్కిల్లో విగ్రహానికి లైటింగ్‌ గ్రిల్‌ ఏర్పాటు చేయడంతో బుధవారం మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాల వేసి వైసీపీ పార్టీకి కతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుంగనూరు అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి లైటింగ్‌ చుట్టూ గ్రిల్‌ ఏర్పాటు చేసినందుకు మంత్రివర్యులు పెద్ద రెడ్డి రామచంద్ర రెడ్డి కి , ఎంపీ మిథున్‌ రెడ్డి కి చిత్తూరు జిల్లా ఎంపీ రెడ్డప్పకి, ఉడ చేర్మన్‌ వెంకట రెడ్డి యాదవ్‌ కి మునిసిపల్‌ కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌ కి దళిత సంఘాలు కతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. పుంగనూరుదళిత సంఘాల నాయకులు , మాల మహానాడు ఎస్సీ ఎస్టి నాయకులు కతజ్ఞతలు తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజక వర్గాన్ని అన్ని రంగాల అభివద్ధి చేశారని గతంలో ఎవరు చేయని అభివద్ధి ఇటీవల చేశారని నాయకుల పని తీరుపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు రాజ, శంకరప్ప, పెంచుపల్లి కష్ణప్ప,మాల మహానాడు . భాస్కర్‌ రెడ్డి మంజు సర్పంచ్‌ అంజప్ప పాల్గొన్నారు.