Sep 17,2023 21:10

రోగులకు అవగాహన కల్పిస్తున్న వైద్యుల బృందం

ప్రజాశక్తి - నెల్లిమర్ల : స్థానిక మహారాజా వైద్య విజ్ఞాన సంస్థ జనరల్‌ (మిమ్స్‌) ఆసుపత్రిలో నుంచి ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు మిమ్స్‌ అకడమిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ టి.వేణు గోపాల్‌ తెలిపారు. ఆదివారం జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసి) వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ప్రపంచం రోగుల భద్రతా దినోత్సవాలు మిమ్స్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మిమ్స్‌ అకడమిక్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవాలు ఆదివారం నుంచి ఈ నెల 25వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవాలను పురస్కరించుకొని మొదటి రోజు రోగులను వారి భద్రత పై నిమగం చేయడం, హక్కులు, భాద్యతలు, సలహాలు, ఫిర్యాదులు వంటి అంశాల పై అవగాహన కల్పించడం, రెండవ రోజున మాక్‌ డ్రిల్‌, మూడవ రోజున మందుల భద్రత (మెడికేషన్‌) కాలం చెల్లిన మందులు, హై రిస్క్‌ మందులు, యాంటీ బయాటిక్స్‌ పాలసీ వంటి అంశాల పై, నాల్గవ రోజున ప్రపంచం ఆరోగ్య సంస్థ నిభందలననుసరించి చేతుల పరిశుభ్రత డిజిటల్‌ శిక్షణ, అయిదవ రోజున విద్యార్దులు మద్య గోడ పత్రికలు నినాదాలు పై పోటీలు థీమ్స్‌ ఆఫ్‌ పోస్టర్‌, స్లొగన్‌ ఆన్‌ ఏడవ అంతర్జాతీయ రోగులు భద్రతా లక్ష్యాలు పై పోటీలు, ఆరవ రోజున (22) వ్యాధి సంక్రమణ నియంత్రణ, రికార్డులు భద్ర పరుచడం, తనిఖీ సౌకర్యం, రోగి భద్రతా లక్ష్యాలు పై ఉత్తమ శాఖ (బెస్ట్‌ డిపార్ట్‌ మెంట్‌) పోటీలు నిర్వహిస్తామన్నారు. కాగా ఈ కార్యక్రమాలు మిమ్స్‌ ఆసుపత్రి నాణ్యత ప్రభందకులు జె. విజరు కుమార్‌, ఔషధ శాస్త్రం ప్రొఫెసర్‌ ఎం. సురేష్‌, సూక్ష్మ జీవశాస్త్రం (మైక్రో బయాలజీ) అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ ఎస్‌.సరస్వతి ఆధ్వర్యంలో జరుగుతాయని అకడమిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వేణు గోపాల్‌ తెలిపారు.