May 05,2023 21:32

అచ్చంపేటలో వర్షాలకు పాడైన వరిపంటను పరిశీలిస్తున్న రైతు, కౌలు రైతు సంఘాల జిల్లా అద్యక్షులు రాజశేఖర్‌ల, నాగేశ్వరరావు



దళారుల ఉచ్చులో రైతులు పడకుండా చూడాలి రైతు, కౌలు రైతు సంఘం డిమాండ్‌

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌
ధాన్యం తీసుకోవడం లో మిల్లర్లు ఆలస్యం చేయడాన్ని నిరోదించాలని, ప్రైవేట్‌ వ్యాపారుల, దళారుల ఉచ్చులో రైతులు చిక్కి నష్టపోకుండా చూడాలని రైతు, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, ఎం.రాజశేఖర్‌లు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వర్షాలవల్ల పంట నష్ట పోయిన గ్రామాలు, ధాన్యం రాసులు, పొలాల్లో వున్న పనలను అచ్చంపేట, గొంచాల, వేమవరం, ఉండూరు గ్రామాల్లో వారు పర్యటించి పరిశీలించి రైతులు సమస్యలు తెలుసు కున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతుల ధాన్యాన్ని మిల్లర్లు త్వరగా తీసుకోకుండా ఆలస్యం చేయడం వలన రైతులు ఒత్తిడికి గురయి తక్కువ ధరకు దళారుల ద్వారా ధాన్యం అమ్మకాలు చేస్తున్నారని, రైతులు తక్కువకే అమ్ముకునేలా, మిల్లర్లు దళారులను అడ్డం పెట్టు కుంటున్నారన్నారు. ఇది ప్రతి మండలం లోను జరుగు తుందని దీనిని అరికట్టాలని రైతు, కౌలు రైతు సంఘాలు జిల్లా అధ్య క్షులు తిరుమలశెట్టి నాగేశ్వరావు, ఎం.రాజశేఖర్‌లు కోరారు. ఉండూరులోని రైతు భరోసా కేంద్రంలో వున్న మండలం ధాన్యం కొనుగోలు ప్రత్యేకాధికారి పి.వసంత మాధవిని కలిసి రైతుల సమస్యలు వివరించారు. ఎఇఒ, విఎఎ ఆర్‌బికెలో అందుబాటులో వున్న సర్వీస్‌ గురించి చర్చించి, రైతులను కల్లాల్లో కలిసి వారికి అవగాహన కల్పించాల్ని కోరినట్లు చెప్పారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ వే-బిల్లులు కూడా త్వరగా ఇవ్వడం లేదని, దీంతో అన్‌ లోడ్‌ అవడం లేకపోతే తక్కువ ధరకే తమకు అమ్మేయమని చెపుతున్నారని వాపోయారు. ఈసందర్బంగా రైతులు తమ సమస్య లను రైతు నాయకుల సమక్షంలో అధికారులకు తెలియజేశారు. మల్లిపూడి నర్సింహారావు, కర్నీడి సత్యనా రాయణ, రాంబాబు, వెంకటేశ్వర రావు, రాజా, అబ్బిరెడ్డి అన్నవరం, డేగల శ్రీను, పులిపాటి చిన్న, పల్లి చక్రయ్య పెర్నీడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.