శుభాకాంక్షలు తెలుపుతున్న ఇంటూరి నాగేశ్వరరావు
ప్రజాశక్తి-కందుకూరు :ఈద్-ఏ-మిలాద్-ఉన్-నబీ సందర్భంగా పట్టణ ముస్లిం నాయకులకు కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాగేశ్వరావు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జీవితం ప్రేమ, సౌభ్రాతత్వం, ధర్మంతో కూడినని పేర్కొన్నారు. మానవాళికి ఎంతో స్ఫూర్తిదా యకమైనని ఆయన పేర్కొన్నారు. ముస్లిం పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్ సలాం, నాయకులు షేక్ మున్నా, షేక్ ఫిరోజ్, రూబీ, నజీర్, గౌస్ బాషా, అహ్మద్ భాష, జిలాని, కరిముల్లా, మా బాషా ఉన్నారు.










