Oct 06,2023 21:06

ర్యాలీ నిర్వహిస్తున్న జర్జలిస్టులు, సంఘాల నాయకులు

కడప ప్రతినిధి ; మీడియాపై దాడులకు పాల్పడడం శోచనీ యమని, ఇలాంటి చేష్టల కారణంగా దేశం నియంత త్వంలోనికి జారుకునే ప్రమాదం ఉందని జర్నలిస్టు సంఘాల నాయకులు రామసుబ్బారెడ్డి, నూర్‌ బాషా, శ్రీనాథరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మా ట్లాడారు. ముందుగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ దేశంలో, రాష్టంలో పాత్రికేయ వత్తి ప్రమాదంలో పడిందన్నారు. ఇటీవల ఢిల్లీలో న్యూస్‌ క్లిక్‌ ఎడిటర్‌ ప్రభీర్‌ పురకాయస్థ ప్రభుత్వ వ్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తున్నాడనే ఉద్దేశంతో డిల్లీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని తెలిపారు. రాష్టంలోనూ పాత్రికేయులు విమర్శ నాత్మక కథనాలు రాసిన వారి పై కేసులు నమోదు చేయించడం పరిపాటిగా మారిందన్నారు. దీంతో పాటు జర్నలిస్టుల సంక్షేమం నిమిత్తం ఇళ్ల స్థలాలు , రైల్వే రాయితీలు, కరోనా మతులకు పరిహారం అందడంలేదని చెప్పారు. అనంతరం జర్నలిస్టు సంఘం నాయకులు నూర్‌ బాషా. శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ దేశంలో మీడియా స్వచ్చ,హక్కులు ప్రమాదంలో పడడడంపై ఆందోళన వ్యక్తం చేశారు. న్యూస్‌ క్లిక్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ అరెస్ట్‌ విషయంలో ప్రమా ణాలు పాటించకపోవడం విస్మయాన్ని కలిగిస్తోందని తెలిపారు. పదేళ్ల కిందట నుంచి దేశంలో పాత్రికేయ వత్తి ప్రమాదంలో పడిందన్నారు. ప్రపంచంలోని 193 దేశాల్లో దేశం మీడియా స్వేచ్ఛ ర్యాంకుల్లో 44వ స్థానం నుంచి 161వ స్థానానికి పడిపోవడం శోచనీయమన్నారు. ఇటీవల జిల్లాలోని వేంపల్లిలో విలేకరులపై కేసులు నమోదు చేయించడం దారుణమన్నారు. దీనికితోడు జర్నలిస్టుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని చెప్పారు. అక్రిడీటేషన్‌ కార్డుల దగ్గర నుంచి హెల్త్‌ స్కీమ్‌, ఇళ్లస్థలాలు, ఇళ్లు మంజూరు చేయడం లేదన్నారు. తమిళనాడు తరహా రూ.10 వేల గౌరవ పారితోషికం ఇవ్వాలని కోరుతూ ధర్నాలు, ర్యాలీలు నిర్వహించామన్నారు. పలుమార్లు వినతిపత్రాలను ఆందజేశామని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్తూ మీడియా స్వేచ్ఛ ను కాపాడాలి, న్యూస్‌ క్లిక్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ అక్రమ అరెస్ట్‌ తగదనే నినాదాలతో హోరెత్తించారు. అనంతరం డిఆర్వో గంగాధరగౌడ్‌కు వినతిపత్రం ఆందజేశారు. కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు సుదర్శన, దుర్గప్రసాద్‌, నారాయణ, సిద్ధయ్య, బాలకష్ణ, రామాంజనేయరెడ్డి, శివరాం, నాగరాజు, ప్రభాకర్‌ రెడ్డి, రమేష్‌ సహా పెద్ద ఎత్తున విలేకరులు, ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు.