'మీడియాకు సంకెళ్లు' దారుణం
ప్రజాశక్తి -చిత్తూరుఅర్బన్
న్యూస్ క్లిక్‌పై ఆంక్షలు , దాడులను నిరసిస్తూ గురువారం పలమనేరు అంబేద్కర్ సర్కల్ వద్ద జర్నలిస్టు పెడరేషన్ నేతృత్వంలో ఎపిడబ్ల్యుజెఎఫ్, ప్రజాసంఘాల నేతృత్వంలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. పత్రిక స్వేచ్ఛను కాపాడాలంటూ నినాదాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతికా స్వచ్ఛపై దాడులు చేస్తూ రాజ్యాగాన్ని అపహాస్యం పాలు చేస్తున్నాయని జర్నలిస్టు ఫెడరేషన్ నాయకులు గోపి అన్నారు. సామాన్య, మధ్యతరగతి హక్కులను ప్రశ్నించడంతో పాటు మతోన్మాదం వల్ల కలిగే ప్రమాదాన్ని తెలియజేసిన న్యూస్‌క్లిక్ కార్యాలయాలు, సిబ్బందిపై దాడులు చేయడంతో ప్రతికాస్వచ్ఛను హరించేలా కేంద్రంలోని మోడి సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు. జర్నలిస్టుల ఆందోళనకు సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్పొరేట్‌సంస్థలకు ఊడిగం చేస్తున్న మోడి ప్రభుత్వం ప్రతికా స్వేఛ్చపై దాడులకు పూనుకుంటోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అంబేద్కర్ రాజ్యాగం ప్రమాదంలో పడిందన్నారు. ప్రతికా స్వేచ్ఛను హరించేలా దాడులకు పూనుకుంటోదన్నారు. ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయవాదులు, మేధావులు ప్రతికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను ఖండిచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మునిరత్నం, సిఎస్ ప్రసాద్, దివ్య, దాము, రామాంజనేయులు, బాలసుబ్రమణ్యం, రాజేష్, మురళి, అశ్వర్ధనారాయణ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
పాలకుల దౌర్జన్యం నశించాలి : సిపిఎం
ప్రజాశక్తి- గూడూరు టౌన్
న్యూఢిల్లీలో 'న్యూస్ క్లిక్' కార్యాలయం జర్నలిస్టుల నివాసాలపై దాడులను ఖండిస్తూ గురువారం గూడూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో మీడియాతో పట్టణ కార్యదర్శి జోగి.శివకుమార్ మాట్లాడుతూ పాత్రికేయ స్వాతంత్రాన్ని గౌరవించడం తెలియని హేతుబద్ధమైన, విమర్శలను లేదా దేశ వ్యాప్త వ్యతిరేక ప్రచారంగా పరిగణించే కేంద్ర ప్రభుత్వ పాలకుల దౌర్జన్యం నశించాలని, ఈ దుర్మార్గపు చర్యలను సిపిఎం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. భారత రాజ్యాంగ ప్రకారం పాత్రికేయ స్వేచ్ఛను, వారి జీవితాల కోసం తాము పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి.వి రమణయ్య, ఎస్.సురేష్, అడపాల ప్రసాద్, బి.గోపీనాథ్, డి. కోటేశ్వరరావు, బి.చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
న్యూస్‌క్లిక్‌పై దాడులను నిరశిస్తూ ధర్నా చేస్తున్న జర్నలిస్టులు










