
ప్రజాశక్తి - ఎఎన్‌యు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంబిఎ మీడియా మేనేజ్మెంట్, ఎంబిఎ టెక్నాలజీ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అడ్మిషన్ల డైరెక్టర్ డాక్టర్ జి.అనిత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబిఎ కోర్సులకు ఆదరణ మెండుగా ఉందని, ఈ కోర్సులో ప్రవేశాలకు ఐసెట్ రాసిన అభ్యర్థులతో పాటు రాయని వారికి కూడా అవకాశం ఉన్నట్లు తెలిపారు. మీడియా మేనేజ్మెంట్ కోర్సుకు ఏదైనా సాధారణ డిగ్రీ ఉత్తీర్ణతను అర్హతగా నిర్ణయించామని, ఎంబిఎ టెక్నాలజీ మేనేజ్మెంట్‌కు బీటెక్ లేదా బిఇ కోర్సులలో ఏదైనా ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ కోర్సులకు ఇప్పటికే కొన్ని సీట్లు భర్తీ చేసినట్లు తెలిపారు. ఐసెట్ ద్వారా ఎంబిఎ కోర్సులకు ప్రవేశాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎంబిఎ మీడియా మేనేజ్మెంట్, ఎంబిఎ టెక్నాలజీ మేనేజ్మెంట్, ఎంబిఎ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తుల కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కోర్సుల్లో అన్ని నిష్ణాతులైన అధ్యాపకులతో పాటు ఆధునిక సౌక ర్యాలు, మౌలిక సదుపాయాలు ఉన్నాయని, వివిధ పరిశ్రమలకు చెందిన సీనియర్ పారిశ్రామిక వేత్తలతోనూ ఆయా కోర్సులకు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు.