Nov 06,2023 21:28

ఎఫ్‌ఐఆర్‌ కాపీలను దగ్ధం చేస్తున్న సిఐటియునా యకులు

          ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌    కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మీడియా గొంతు నొక్కాలనుకోవడం బాధాకరమని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌, ఎపి రైతుసంఘం జిల్లా అధ్యక్షులు తరిమెల నాగరాజు డిమాండ్‌ చేశారు. సోమవారం జర్నలిస్టులపై తప్పుడు కేసులు బనాయించి అక్రమ అరెస్ట్‌ చేయడాన్ని నిరసిస్తూ రైతుసంఘం, సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ఎఫ్‌ఐఆర్‌ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల అరెస్టులను వ్యతిరేకిస్తూ ఆల్‌ ఇండియా కిసాన్‌ కోఆర్డినేషన్‌ కమిటీ, అఖిల భారత కేంద్ర కార్మిక సంఘాల జేఏసి పిలుపు మేరకు ఎఫ్‌ఐఆర్‌ ప్రతులను దహనం చేసినట్లు తెలిపారు. కార్మిక, రైతు, ప్రజా ఉద్యమాలకు అండగా నిలుస్తున్న న్యూస్‌క్లిక్‌ వార్తా ఛానల్‌పై మోడీ ప్రభుత్వం కక్షకట్టిందన్నారు. సంయుక్త కిసాన్‌ మోర్చా నడిపిన రైతు ఐక్య ఉద్యమానికి మద్దతుగా నిలబడడమే వారు చేసిన నేరమైనట్లు అరెస్ట్‌ చేశారన్నారు. రాజ్యాంగం అనుమతించిన భావ ప్రకటనా స్వేచ్ఛను కూడా మోడీ ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. న్యూస్‌ క్లిక్‌ జర్నలిస్టులు ప్రబీర్‌ పురకాయస్త, అమిత్‌ చక్రవర్తుపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి జైల్లో పెట్టిందన్నారు. జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించి వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ ప్రతుల దహనాన్ని అడ్డుకుని మంటలు ఆర్పారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం, సిఐటియు నాయకులు ఎటిఎం నాగరాజు, రాయుడు, నల్లప్ప, రాముడు, నరసింహారెడ్డి, నాగార్జున, ఓబులేసు, శంకర్‌, ఆదినారాయణ, నాగమ్మ, లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు.
బుక్కరాయసముద్రం : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మీడియా గొంతు నొక్కాలనుకోవడం బాధాకరమని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌, రైతుసంఘం జిల్లా కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి, పండ్లతోటల రైతుసంఘం జిల్లా కార్యదర్శి వి.శివారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం న్యూస్‌ క్లిక్‌ మీడియా సంస్థ అధిపతి ప్రబీర్‌ పురకాయస్తపై పెట్టిన అక్రమ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీలను సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోర్త్‌ ఎస్టేట్‌గా పిలిచే మీడియాపై కేంద్రంలోని బిజెపి ఆంక్షలు విధించడం మీడియా నోరు నొక్కేయడమే అన్నారు. నిజాలను నిర్భయంగా ప్రజలకు తెలియజేస్తే అడగదొక్కాలని చూడటం మంచిది కాదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వెంకటనారాయణ, రైతుసంఘం జిల్లా నాయకులు కుళ్లాయప్ప, పోతలయ్య, రైతుసంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు రెడ్డిపల్లి శ్రీనివాసులు, వెంకటకొండ బాలక్రిష్ట, పరమేష్‌, శివ, సిఐటియు మండల కార్యదర్శి నాగేంద్ర, సంజీవరెడ్డి, పుల్లయ్య, శ్యామల, తదితరులు పాల్గొన్నారు.