Dec 01,2022 23:45

మాట్లాడుతున్న సిఐ

ప్రజాశక్తి- అరకులోయ:మండలంలోని సుంకరమెట్ట పంచాయతీ కార్యాలయంలో అరకులోయ పోలీసులు గురువారం మీకోసం మీ పోలీస్‌ అనే కార్యక్రమమును నిర్వహించి అక్కడి గిరిజనులకు, యువతకు అవగాహన కల్పించారు. సీతారామరాజు జిల్లా ఎస్పీ సతీష్‌ కుమార్‌ ఆదేశాల మేరకు అరకులోయ సీఐ జీడి బాబు ఈ కార్యక్రమం నిర్వహించి ఆన్లైన్‌ మోసాలు, గంజాయి అక్రమ రవాణా, దొంగతనాలు వంటి వాటిపై అవగాహన కల్పించారు.ఆదివారం వారపు సంత రోజున ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సీఐ వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది, ప్రజలు, యువత పాల్గొన్నారు.