ప్రజాశక్తి-చోడవరం
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక ఎంఇఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎపి మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి.వరలక్ష్మి మాట్లాడుతూ ప్రతి నెలా 5వ తేదీ నాటికి కార్మికులకు వేతనాలు ఇవ్వాలని, బకాయి పడ్డ 12 నెలల వేతనం తక్షణమే చెల్లించాలని, కనీస వేతనాల అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు బుచ్చి రాజమ్మ, అమీనా, లక్ష్మి, రాము తదితరులు పాల్గొన్నారు.
సబ్బవరం : మధ్యాహ్న భోజన వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ స్థానిక ఎంఇఒ ఎస్.అప్పలరాజుకు సీఐటీయూ మండల కార్యదర్శి ఉప్పాడ సత్యవతి ఆధ్వర్యంలో మిడ్డేమీల్స్ కార్మికులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో విద్యార్థులకు భోజన ఖర్చులకు రోజుకు రూ.20కు పెంచాలని, గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షులు ఎస్.గౌరి, దేముడమ్మ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : మిడ్డేమీల్స్ కార్మికుల సమస్యలపై సోమవారం ఎంఇఒకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్షులు అమర పిన్ని వరలక్ష్మి మాట్లాడుతూ కొత్త మెనూలో హాట్ పొంగలి, సాంబార్ బాత్, ఆకుకూరను తొలగించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలని కోరారు. గుర్తింపు కార్డులు, యూనిపారం దుస్తులు పంపిణీ చేయాలని, జీవిత బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. సంఘం నాయకులు ఉమా కార్మికులు పాల్గొన్నారు.
కశింకోట : మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద సోమవారం మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు దాకారపు శ్రీనివాసరావు, మధ్యాహ్న భోజనం నిర్వాహకులు సంఘం శ్రీదేవి, సూర్య లక్ష్మి, అమ్మాజీ పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్ : మధ్యాహ్నం భోజన పథకం కార్మికులకు కనీస వేతనాలు మధ్యాహ్న భోజనం పధకం కార్మిక సంఘం (సిఐటియు )అధ్యక్షులు కె. ప్రసన్న డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఎంఇఒకు భోజన కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందించారు. మెనూలో చేసిన మార్పులకు చెల్లిస్తున్న ఛార్జీలకు పొంతన లేదని, మెనూ ఛార్జీలను రోజుకు, ఒక్కో విద్యార్థికి రూ.20కి పెంచాలన్నారు. యూనిపాం, గుర్తింపు కార్డులు అందజేసి, ప్రమాద బీమా వర్తింపజేయాలన్నారు కార్యక్రమలో యూనియన్ నేతలు బి. సత్వవేణి, బి. రత్నం, ఎల్. జగది, పి. రాజేశ్వరి, కె. రత్నం పాల్గొన్నారు.










