
ప్రజాశక్తి - భీమవరం రూరల్
దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసి మనకు స్వేచ్ఛా వాయువులను అందించిన ప్రసాదించిన మహనీయులను, వీరులను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవం నా భూమి-నా దేశం, నేల తల్లికి వందనం - వీరులకు వందనం కార్యక్రమంలో భాగంగా బుధవారం వెంప పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పి.ప్రశాంతి పాల్గొని మాట్లాడారు. తొలుత విద్యార్థులు డ్రమ్స్ వాయిద్యాలతో కలెక్టర్‌కి స్వాగతం పలకగా, పంచాయతీ కార్యాలయం వరకు కలెక్టర్ విద్యార్థులతో కలిసి ర్యాలీగా నడిచారు. అనంతరం పంచాయతీ కార్యాలయం ఆవరణలో మట్టి దీపాలతో అలంకరించి ఏర్పాటు చేసిన నా మట్టి - నా దేశం శిలాఫలకాన్ని ఆవిష్కరించి, మొక్కను నాటారు.
శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో భీమవరం ప్రకాశం చౌక్‌లో నా మట్టి - నా దేశం కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రశాంతి ప్రారంభించారు. ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులతో ర్యాలీ, ప్రతిజ్ఞ చేశారు. కెజిఆర్‌ఎల్ బి ఫార్మసీ, పీజీ కోరేస్, సిఎస్‌ఎన్ జూనియర్ కళాశాల, ఆర్‌ఆర్ డిఎస్ డిగ్రీ కళాశాల, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు సుమారు 500 మందితో ప్రకాశం చౌక్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నా మట్టి నా దేశం నినాదంతో ర్యాలీ నిర్వహించారు.
పెనుగొండ : పెనుగొండ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్‌పి రివిప్రకాష్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి మనోహర చారి, సిఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐ రమేష్ పాల్గొన్నారు.
ఆచంట : కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అనుసరించి పంచాయతీరాజ్ కమిషనర్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు ఆచంట మండలంలో బుధవారం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. నా దేశం-నా భూమి నా మట్టి నేల తల్లికి నమస్కారం వీరులకు వందనం అనే సందేశంతో శిలాఫలకాలను ఆవిష్కరించారు. మండలంలో ఆచంట, కొడమంచిలి, పెనుమంచిలి, వల్లూరు, భీమలాపురం, ఆచంట వేమవరం పలు గ్రామాల్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు సుంకర సీతారామ్, కోట సరోజినీ వెంకటేశ్వరరావు, జక్కంశెట్టి చంటి, గణేశుల శేషవాణి, సుబ్బారావు, నేలపూడి బేబీ రామ్మోహన్‌రావు, ఎంఇఒ రాజేంద్రప్రసాద్, ఇరిగేషన్ ఎఇఇ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పెనుమంట్ర :గ్రామం కోసం త్యాగం చేసిన వీరుల సేవలు మరువరాదని ఎంపిడిఒ వి.పూర్ణబాబ్జి అన్నారు. మండలంలోని పొలమూరు, పెనుమంట్ర, మాముడూరు, సోమరాజు ఇల్లింద్రపర్రు, గరువు మల్లిపూడి, జుత్తిగ, నత్తారామేశ్వరంతో పాటు పలు గ్రామాల్లో నా భూమి - నా దేశం నేల తల్లికి నమస్కారం - వీరులకు వందనం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలిదిండి పెద్ద సుబ్బరాజు (పిఎస్‌ఆర్), ఎర్రమిల్లి నరసింహరావు, కలిదిండి రఘునాథరాజు, దండు చంద్రరాజు (తాతరాజు), పెన్మెత్స వెంకట్రాజులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పొలమూరు సర్పంచి కాకర రాజేశ్వరరావు, ఉప సర్పంచి కలిదిండి దినేష్‌రాజు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, ఎఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, వైసిపి నేతలు, ఎన్‌ఆర్‌ఇజిఎస్ టిఎ ఎం.బాపూజీ, సిబ్బంది పాల్గొన్నారు.
ఉండి : ఆజాదీ కా అమృత్ మహోత్సవం ముగింపు వేడుకల్లో భాగంగా మండల వ్యాప్తంగా నా భూమి నా దేశం కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ సర్పంచుల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఉండి, యండగండి, ఉప్పులూరు గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచులు కమతం సౌజన్య బెనర్జీ, గోగులమండ చిన్నకృష్ణమూర్తి, యర్రా దుర్గారావు పాల్గొని మాట్లాడారు. ఉండి గ్రామానికి చెందిన కెప్టెన్ గాదిరాజు రామభద్ర రాజు (సుబేదార్ రాజు) జ్ఞాపకార్థం శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలలో ఎంపిపి ఇందుకూరి శ్రీహరి నారాయణ రాజు, ఉండి గ్రామ ఉపసర్పంచి గొట్టుముక్కల కల్యాణ్‌వర్మ, ఇన్‌ఛార్జి తహశీల్దార్ వీరాస్వామినాయుడు పాల్గొన్నారు.
ఆకివీడు :సమాజంలో ప్రతిఒక్కరూ స్వార్థ రహితంగా సమాజాభివృద్ధిలో భాగం కావాలని చైర్‌పర్సన్ జామి హైమావతి పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో వారం రోజులు జాతీయస్థాయిలో చేపట్టే నా మట్టి నాదేశం కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా చైనా సరిహద్దుల్లో సైనిక విభాగంలో పనిచేస్తూ విదేశీయ దాడుల్లో చనిపోయిన ఆకివీడు శాంతినగర్‌కు చెందిన వివి.నాగ గోవర్ధన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కమిషనర్ కృష్ణమోహన్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్ పర్సన్ పుప్పాల సత్యనారాయణ, కౌన్సిలర్లు దొడ్డి జగదీష్, ఎన్.నాగేశ్వరరావు, గేదెల అప్పారావు పాల్గొన్నారు.