ప్రజాశక్తి-విజయవాడ : తెలుగు వారి కీర్తి పతాకాన్ని ప్రపంచస్థాయిలో చాటిన మహనీయుడు పింగళి వెంకయ్య అని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బందరు రోడ్డులోని బాపూ మ్యూజియంలో బుధవారం జరిగిన పింగళి వెంకయ్య 145వ జయంతి వేడుకలలో క్రీడలు, యువజన సేవలు పురావస్తు శాఖ కమిషనర్ డాక్టర్ జి.వాణిమోహన్, ఎంఎల్‌ఎ విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మ్యూజియం ఆవరణలోని ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.










