ప్రజాశక్తి - చీరాల
గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుక భాషలోకి తీసుకొచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, విలువనూ తెలియజెప్పిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులని తెలుగు బాషా సంఘ అధ్యక్ష, కార్యదర్శులు బత్తుల బ్రహ్మారెడ్డి, గోర్పుని శివప్రసాదరావు పేర్కొన్నారు. తెలుగు భాషాదినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. గిడుగు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు కవులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. పండితులకే పరిమితమైన భాషను, చదువును సామాన్య ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చారని అన్నారు. కార్యక్రమంలో భాగి కృష్ణమూర్తి, వడలి రాధాకృష్ణమూర్తి, కోడూరి ఏకాంబరేశ్వరబాబు, వంగర శ్రీధర్, శివకుమార్, ప్రసాదరావు, చుండూరి కృష్ణమూర్తి పాల్గొన్నారు.










