Jul 03,2023 00:50

చిలకలూరిపేట: మహిళలు ప్రస్తుతానికి అనేక సమస్యలను ఎదు ర్కొంటున్నారని, వాటిపై పోరాడి సమస్యలను పరిష్క రించుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సం ఘం (ఐద్వా) రాష్ట్ర నాయకులు గద్దె ఉమాశ్రీ అన్నారు. స్థానిక పండరీపురంలోని ఏలూ రు సిద్దయ్య విజ్ఞాన కేం ద్రంలో ఆదివారం జరిగిన మహిళా సంఘు సమా వేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ రోజు రోజుకు మహిళలపై అగత్యాలు, దాడులు,హింసలు పెరిగి పోతున్నాయన్నారు. అత్యాచారం చేసిన వారికి వెంటనే శిక్షలు పడటం లేదని, విచారణ, రిపోర్టుల పేరిట సంవత్సరాల తరబడి కాల యాపన చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గంజాయి,మద్యం అమ్మ కాలు గురించి ఆమె ప్రస్తా వించారు. గంజాయి మత్తులో యువత పక్కదారి పడు తూ వారి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని అన్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయని, విశాఖ ఉక్కు , విద్యుత్తు బిల్లులు మొదలైన అంశాలపై ఆమె మాట్లాడారు. సమా జంలో మహిళలకు జరిగే అన్యా యాలను వ్యతి రేకంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానా లకు వ్యతిరేకంగా పోరాడాలని పిలువు నిచ్చారు. మహిళలు ఉద్యమిస్తేనే అనేక రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. పి. భారతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్య దర్శి పేరుబో యిన వెంకటేశ్వర్లు, ఎం.ఏసమ్మ, దుర్గ, సంతోష్‌, శివపార్వతి తదితరులు పాల్గొన్నారు.