Jun 23,2023 20:58

సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వవిప్‌ కొరముట్ల శ్రీనివాసులు

రైల్వేకోడూరు : మహిళలు కుట్టుమిషన్ల ద్వారా స్వయం ఉపాధి పొంది తమ కాళ్లపై నిలబడి ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, రాష్ట్ర నైపుణభివద్ధి సంస్థ చైర్మన్‌ కొండూరు అజరురెడ్డి అన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ సహకారంతో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలోస్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్కిల్‌హబ్‌లో శిక్షణ పొందిన 60 మంది నిరుద్యోగ మహిళలకు కుట్టు మిషన్లను ఎంపిడిఒ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్‌ హుబ్‌లో శిక్షణ తీసుకొని యువత లక్ష్యసాధన దిశగా చిత్తశుద్ధితో కష్టపడి పని చేస్తే ఎంతటి కష్టతరమైన పనికూడా విజయవంతమవుతుందని అన్నారు. యువత ఉద్యోగాలు పొందేలా చాలా పథకాలను చేపట్టిందని, అందులో భాగంగానే రైల్వే కోడూరులో నైపుణ్య హబ్‌లను ఏర్పాటు చేసిందని, జిల్లా యువత ఇటువంటి సౌకర్యాలను ఉపయోగించుకొని, ఉన్నత ఉద్యోగాలు పొందాలని అన్నారు. 60 మంది శిక్షణ పొందిన మహిళలకు ఎపిఎండిసి ఫౌండేషన్‌ వారి ఆధ్వర్యంలో 60 కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎపిఎండిసి చీఫ్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ సుదర్శన్‌ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ సుకుమార్‌ రెడ్డి, వైస్‌ ఎంపిపి ధ్వజారెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ సుబ్బరాజు, జడ్‌పిటిసి శ్రీరత్నమ్మ, నైపుణ్యాభివద్ధి సంస్థ జనరల్‌ మేనేజ్‌ గోపీనాథ్‌, రాష్ట్ర అభివద్ధి సంస్థ జిల్లా అధికారి హరికష్ణ, శిక్షకులు పార్థసారధి పాల్గొన్నారు.