ప్రజాశక్తి-బాపట్ల : ప్రతి మహిళ స్వశక్తితో ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించటానికి ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయాలని బాపట్ల డిఆర్‌ఒ కె. శివనాగజ్యోతి తెలిపారు. అంత ర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు మహిళలను గురువారం సన్మానించారు. జిల్లా సచివాలయ సేవకులకు హైజీన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తతం చేయడానికి తనవంతు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు కవిత, డిటీ శ్రీదేవి, విజరు కుమార్, జాగర్లమూడి లక్ష్మీ, విస్తరణ కేంద్రం శిక్షణాది óకారులు లలిత, జి.కిజియా, మహిళా పోలీస్ ఎం.నాగజ్యోతి, యోగా శిక్షకురాలు డి.శైలజ, ప్రింటింగ్ ప్రెస్ అధినేత్రి లీలారాణి , రెడ్ క్రాస్ సిబ్బంది నవనీత కష్ణ, గోపీ కష్ణ , రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ నారాయణ భట్టు మహిళలు పాల్గొన్నారు.










