Oct 05,2023 00:49

మహిళలు శారీరక మానసిక స్థైర్యం కలిగి ఉండాలి



మహిళలు శారీరక మానసిక స్థైర్యం కలిగి
ఉండాలి
ప్రజాశక్తి -కార్వేటినగరం : సమాజంలోని బాలికలు, మహిళలపై గౌరవం కలిగి ఉండాలని వెదురుకుప్పం వైఎస్సార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి. అన్నపూర్ణ శారద తెలిపారు. బుధవారం కార్వేటినగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఊమెన్‌ ఎంపవర్మెంట్‌ సెల్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సి.ఎన్‌.లత ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌. విజయులు రెడ్డి అధ్యక్షతన బాలికల గౌరవ పరిరక్షణ, వారిపై జరిగే సాంఘిక దురాచారాల నిర్మూలన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బి. అన్నపూర్ణ శారద మాట్లాడుతూ గతంలో స్త్రీ, పురుషులు ఆహారాన్వేషణలో సరి సమానమైన పాత్రను పోషించే వారని, తదనంతరం కాలగమనంలో స్త్రీలు ఇంటికి పరిమితమవడంతో పురుషాధిక్యత ఎక్కువైందని తెలిపారు. సమాజంలో నైతిక విలువలు కలిగి మహిళలు, విద్యార్థినుల పట్ల గౌరవప్రదంగాపాలు పంచుకోవాలని తెలిపారు. విద్యార్థినులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, తమ చుట్టూ గుర్తు తెలియని వ్యక్తుల నుండి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారి గురించి వెంటనే తల్లిదండ్రు లకు, కళాశాల అధ్యాపకులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనంతరం అధ్యాపక బందం ప్రిన్సిపాల్‌ అన్నపూర్ణ శారదా ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు లావణ్య, భార్గవి, కళాశాల సిబ్బంది అశ్విని, తేజోవతి, అరుణ, జోగి ప్రసాద్‌, జేకేసి మెంటర్‌ లోకేశ్వర్‌, విద్యార్థినులు పాల్గొన్నారు.