
హిందూపురం : మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆర్థికాభివృద్ధి సాధ్యం అవుతుందని మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇంద్రజ అన్నారు. శనివారం పట్టణంలోని రోటరీక్లబ్‌లో ఇన్నర్ వీల్ జిల్లా క్లబ్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఛైర్‌పర్సన్ ఇంద్రజ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మహిళా ఆర్థికంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం ప్రభుత్వం మహిళలకు పూర్తి స్థాయిలో చేయుతను ఇస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పదవ తరగతి చదువుతున్న బాలిక విద్యకోసం ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్‌వీల్ క్లబ్ డిస్ట్రిక్ట్ 316 ఛైర్మన్ సుమిత్రా రాజేష్, ఇన్నర్‌వీల్ క్లబ్ అధ్యక్షురాలు కె.భువనేశ్వరి, సెక్రటరీ ఎంకె.శ్రీలక్ష్మి పాల్గొన్నారు.