చెక్కును పంపిణీ చేస్తున్న కలెక్టర్, పిఒ,
ప్రజాశక్తి-పాడేరు టౌన్: మహిళా సంఘాల సభ్యులు బ్యాంకులు అందిస్తున్న రుణాలు సద్వినియోగం చేసుకుని ఆర్ధిక పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. శుక్రవారం ఐటిడిఎ బిఆర్.అంబేడ్కర్ సమావేశ మందిరంలో 43 స్వయం సహాయక సంఘాలకు రూ.2 కోట్ల 30 లక్షల చెక్కను పంపిణీ చేసారు. తీసుకున్న రుణాలను సకాలంలో బ్యాంకులకు చెల్లించి మరిన్ని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలక్రిష్ణ, సబ్ కలెక్టర్ వి.అభిషేక్, డిఆర్‌డిఎ పిడి వి.మురళి, ఎల్ డిఎ రవితేజ, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.










