మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
డోన్ మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్
ప్రజాశక్తి-డోన్
నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని డోన్ మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ ఆకాంక్షించారు. మంగళవారం డోన్ పట్టణంలోని ఇందిరానగర్ లో ఉన్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి శిక్షణ లో శిక్షణ పొందిన మహిళలు ఒక షర్ట్ తయారు చేసి హైదరాబాద్ కు పంపగా వారి నుండి 150 షర్టుల కోసం ట్రయల్ ఆర్డర్లు వచ్చాయని తెలిపారు.శిక్షణ పొందిన మహిళలు చక్కగా షర్టులను రూపొందిస్తే మరెన్నో అవకాశాలు లభిస్తాయని అన్నారు.శిక్షణ పొందిన ప్రతి మహిళ ఇటువంటి అవకాశాలను సద్వినియం చేసుకోవాలని సూచించారు. అనంతరం నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో మహిళలకు కావాల్సిన కొన్ని మౌలిక వసతులు చైర్మన్ దృష్టికి తీసుకుపోగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.










