Sep 15,2023 20:57

మాట్లాడుతున్న వెలుగు మండల సమాఖ్య ప్రతినిధి బీబీ

కాశినాయన : మండల సమాఖ్య ద్వారా గ్రామాల్లోని డ్వాక్రా సంఘాలు అభివృద్ధి చెందు తాయని వెలుగు ఎపిఎం వీరాంజనేయులు పేర్కొ న్నారు. శుక్రవారం వెలుగు కార్యాలయంలో 15వ వార్షికోత్సవ మహాసభ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన 2022- 23 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు క్షుణ్ణంగా వివరించారు. ప్రభుత్వం ద్వారా డ్వాక్రా మహిళలకు వచ్చే లబ్ధిని బ్యాంకు ద్వారా కానీ, గ్రామ సంఘాల ద్వారా కానీ రుణాలు తీసుకుని ఏవిధంగా అభివృద్ధి చెందాలో వివరించారు. ఎక్కడ రుణం తీసుకున్నా తప్పకుండా కంతులు సక్రమంగా చెల్లించినట్లయితే డ్వాక్రా మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. బ్యాంకు లింకేజీ సున్నా వడ్డీ, స్త్రీ నిధి గ్రామ సంఘాల ద్వారా రుణాలు తీసుకుని తిరిగి చెల్లిస్తూ ఉండాలని సూచించారు. ఈ ఏడాది మండల సమాఖ్యకు దాదాపు రూ. రెండు లక్షల ఆదాయం ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో లీగల్‌ కో-ఆర్డినేటర్‌ రవికుమార్‌, పోరుమామిళ్ల ఎపిఎం అశోక్‌రెడ్డి, స్త్రీనిధి, మేనేజర్‌ సుబ్రహ్మణ్యం, సిసిలు, వివోలు, పలు గ్రామ సంఘాల ప్రతినిధులు, అకౌంటెంట్‌ రాజశేఖర్‌ పాల్గొన్నారు.