Mar 07,2023 23:47

మాట్లాడుతున్న డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ హేమంత్‌

ప్రజాశక్తి-అనకాపల్లి
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న మహిళలు తమ ఆరోగ్య పట్ల కూడా తగిన శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ హేమంత్‌ పేర్కొన్నారు. మండలంలోని రేబాక గ్రామంలో మంగళవారం ఆయుష్మాన్‌ భారత్‌, బేటీ బచావో, లింగ వివక్ష నిర్మూలన, అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల్లో రక్తహీనత రాకుండా చూసుకోవాలన్నారు. అందుబాటులో ఉన్న ఆకుకూరలు, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రక్తహీనత వ్యాధి నుంచి బయటపడవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుశీల కౌశిక్‌, ఝాన్సీ రాణి, వైద్య సిబ్బంది, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.