ప్రజాశక్తి-కంచికచర్ల
మహిళలు స్వయం శక్తితో ఆర్ధికంగా ఎదగాలని నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్‌రావు అన్నారు. కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కంచర్ల పద్మావతి నూతనంగా ఏర్పాటు చేసుకున్న చిన్న తరహా పరిశ్రమను బుధవారం మొండితోక జగన్ మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోని ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు వైయస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను, కార్యక్రమాలను వినియోగిం చుకుంటూ మహిళలు స్వయం ఉపాధి ద్వారా చిన్న తరహా కుటీర, పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో గ్రామ సర్పంచ్ యద్దనపూడి ఆనంద జ్యోత్స్న, వైసిపి నాయకులు మార్తా శ్రీనివాసరావు, రామకష్ణ, కార్యదర్శి షేక్ మీర్జావలి తదితరులు పాల్గొన్నారు.










