Dec 20,2022 00:04

మాట్లాడుతున్న ఎస్‌ఐ

ప్రజాశక్తి-కొత్తకోట:లైంగిక వేధింపులు పట్ల మైనర్‌ బాలికలు, మహిళలు అప్ర మత్తం గా మెల గాలని కోరు తూ జిల్లా పోలీసులు సోమవారం ప్రచారం చేపట్టారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ గౌతమి శాలి ఆదేశాల మేరకు కొత్తకోట ఎస్సై విభూషణరావు ఆధ్వర్యంలో టి.అర్జా పురం, కొత్తకోట, దొండపూడి, జెడ్‌.కొత్తపట్నం తదితర గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలో ఈ ప్రచార కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రచార రధంలో లైంగిక దాడులు నివారణ, అవగాహనపై ఎస్సై వివరించారు. ఆయా పాఠశాలల హెచ్‌ఎం నాయుడు, సత్యారావు, నాగేశ్వరరావు, సిఆర్‌పి రామారావు పాల్గొన్నారు.