Mar 08,2023 22:59

ప్రజాశక్తి-విజయవాడ 

అంతర్జాతీయ మహిళా దినోత్స వాన్ని పురస్కరించుకొని విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పింక్‌ ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహిం చారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుండి ప్రారంభమైన సైకిలింగ్‌, నడక కార్యక్రమం రాఘవయ్య పార్క్‌ వరకు నడిచింది. తొలుత ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, డిప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ, కార్పొరేటర్లతో కలిసి మేయర్‌ రాయన భాగ్యలక్ష్మీ పావురాలను ఎగరవేసి, జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తుండటం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. కమిషనర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ పథకాలను వినియోగించుకొని మహిళలుఅన్ని రంగాల్లో అభివృద్ది సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పడిగిపాటి చైతన్య రెడ్డి, మైలవరపు రత్నకుమారి, శర్వాణీ మూర్తి , బిఎస్‌వి జానారెడ్డి, అదనపు కమిషనర్‌ (జనరల్‌) యం.శ్యామల, అదనపు కమిషనర్‌ (ప్రాజెక్ట్స్‌) కె.వి సత్యవతి, డిప్యూటీ సిటి ప్లానర్‌ (ప్లానింగ్‌) జుబిన్‌ శిరన్‌ రారు, వి.ఏ.ఎస్‌ డా.రవిచంద్‌, డైరెక్టర్‌ అఫ్‌ స్పోర్ట్స్‌ టి. శ్రీనివాస్‌, ఇతర అధికారులు, స్కూల్‌ విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.