మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
డోన్ మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్
ప్రజాశక్తి-డోన్
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని డోన్ మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ అన్నారు. గురువారం డోన్ పట్టణంలోని స్థానిక నెహ్రూనగర్ మున్సిపల్ పార్కులోని డోన్ మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పొదుపు లక్ష్మి మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డోన్ మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పులివెందుల తర్వాత గతంలో ఎప్పుడు లేకుండా ఉన్న అభివృద్ధిని డోన్‌లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సహకారంతో అభివృద్ధిని చేసుకోవడం జరిగిందన్నారు. రాజకీయాలకు అతితంగా డోన్‌ని అభివృద్ధి చేసుకోవడం ఎంతో సంతోషిం చదగ్గ విషయం అన్నారు. అనంతరం ఆటలో పోటీల్లో 300 మంది పొదుపు లక్ష్మి మహిళలు పాల్గొనగా అందులో 17 మంది మహిళలు గెలు పొందారు. స్టార్ మహిళ ప్రోగ్రాంలో యు.రామేశ్వరి, ఇంద్రజలు గెలుపొం దారు. లెమన్ స్పూన్ ఆటలో జి.కీర్తి,యు.భవాని,సాహిన్ కౌసర్‌లు గెలు పొందారు. మ్యూజికల్ చైర్స్‌లో ఆర్.రమ, ఎన్. మంజుల, స్నేహలతలు గెలుపొందారు. వాటర్ మెలన్ ప్రోగ్రాంలో ఎస్.సాధిక, కె.లక్ష్మీదేవి, ఇ.లక్ష్మి లు గెలుపొందారు. బెలూన్ గేమ్‌లో వి.పూజిత, డి. రబియా, ఇ.సువర్ణలు గెలుపొందారు. షాట్‌ఫుట్ గేమ్‌లో కె.ఇంద్రజ,వి.రామేశ్వరి,సుగుణల గెలుపొందారు. గెలుపొందిన పొదుపు లక్ష్మి మహిళలకు మెమోంటోలతో పాటు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్‌ఎండి జాకీర్ హుస్సేన్,సీనియర్ న్యాయవాది ఎం. నాగభూషణ్ రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామచంద్రుడు, కౌన్సిలర్లు ఆర్ట్ రమణ,దారా హరినాథ్ రెడ్డి,రైల్వే నాగేంద్ర,మిట్టా ఉమామహేశ్వరి,బోయ సుమలత,పాలుట్ల మీనాక్షి, ఫాతిమాబి,సుంకన్న,పిఈటి మోహన్, వైసిపి నాయకులు మిట్టారవి తదితరులు పాల్గొన్నారు.










