Oct 01,2022 23:19

ఎండాడలో చేయూత చెక్కును అందిస్తున్న ముత్తంశెట్టి తదితరులు

ప్రజాశక్తి -మధురవాడ : రాజకీయంగా, ఆర్థికంగా మహిళలు ముందుకు వచ్చిన రోజే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. 8వ వార్డు పరిధి ఎండాడ ముబారక్‌ కాలనీలో చేయూత పథకాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ చేయూత కింద 900 మందికి 9.92 కోట్లు చెక్కును అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మహిళలకు సముచిత స్థానం కల్పించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ధ్యేయం అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ బి.రాము, వార్డు కార్పొరేటర్‌ ఎన్‌.అప్పారావు, అల్లాడ ఉమామహేశ్వరావు, జి.పోలిరెడ్డి, గోపి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
సింహాచలం: జివిఎంసి 98వ వార్డులో భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైఎస్‌ఆర్‌ చేయూత లబ్ధిదారులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రానున్న ఎన్నికల ముందే బిఆర్‌టిఎస్‌ రోడ్డు పనులు చేపడతామని చెప్పారు. పంచ గ్రామాల సమస్య కూడా త్వరలో పరిష్కారం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జోన్‌ కమిషనర్‌ మల్లునాయుడు, వైసిపి నాయకులు కొలుసు ఈశ్వరరావు, అడివరం సహకార పరపతి సంఘం అధ్యక్షులు కర్రి అప్పలస్వామి ఎర్రవరం బాబు, కర్రి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.