Jun 14,2023 00:45

మాట్లాడుతున్న పీడీ అర్జున్‌ రావు

ప్రజాశక్తి - పంగులూరు. : డ్వాక్రా మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వి నియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఇందిరా కాంతి పథకం ప్రాజెక్టు డైరెక్టర్‌ డాక్టర్‌ బి. అర్జున్‌రావు తెలిపారు. పంగులూరు లోని వెలుగు కార్యాలయంలో ఎపిఎం జ్యోతి ప్రసాద్‌ అధ్యక్షతన విఎఒలతో మంగళవారం సమావేశం నిర్వV ిాంచారు. ఈ సందర్భంగా అర్జును రావు మాట్లాడుతూ మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. 35 శాతం రాయితీతో పిఎంఇజిపి పథకం ద్వారా బ్యాంకు రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. విఒఎలు కూడా ప్రభు త్వంలో ఓ భాగమేనని తెలిపారు. పొదుపు మహిళల్లో విఎఒలు నమ్మకాన్ని కలిగించి ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా పనిచే యాలన్నారు. చదువు రాని పొదుపు మహిళలకు అర్థమయ్యే రీతిలో పొదుపు లెక్కలు చెప్పాలన్నారు. శ్రీనిధి రికవరీకి సంబంధించి రూ. 25 లక్షల రూపాయల ఎన్‌పిఎలపై ఆయన ఆరా తీశారు. మండలంలోని 35 గ్రామ సంఘాలకు గాను మూడు గ్రామ సంఘాల నుంచి స్త్రీ నిధి రుణాల రికవరీ పెడింగ్‌లో ఉందన్నారు. దాన్ని వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ రామాం జనేయులు, పశువైద్యాధికారి డాక్టర్‌ మల్లేశ్వరి, హౌసింగ్‌ ఎఇ కిషోర్‌ కుమార్‌, మండల సమైక్య అధ్యక్షురాలు పూసల గాయత్రి , విఒఎలు పాల్గొన్నారు.