Jul 05,2023 01:02
మాట్లాడుతున్న జిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్‌

ప్రజాశక్తి-కనిగిరి: రోజు రోజుకూ మహిళలపై పెరిగిపోతున్న లైంగిక వేధింపుల నిరోధానికి తగిన చర్యలు తీసుకోవా లని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక సుందరయ్య భవనం లో ఐద్వా జిల్లా శిక్షణా తరగతులు ఎస్‌డి షర్మిల అధ్యక్షతన జరిగాయి. సంస్కరణలు మహిళలపై ప్రభావం అనే అంశంపై ఆయన మాట్లాడారు. మహిళలపై దాడులు పెరిగి రక్షణ కరువు కావ టానికి పాలకుల నిర్లక్ష్యమేనన్నారు. సమానత్వం కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన అన్నారు. మద్యపాన నిషేధం కోసం, ధరల తగ్గింపు కోసం మహిళలు ఐక్యంగా రాబోయే కాలంలో పోరాటా లు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు మద్యపాన నిషేధానికి జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని, ఎన్నికల్లో గెలిచాక ఆ హామీని అటకెక్కించారన్నారు. ఫలితంగా మహిళలకు ఇబ్బందులు తప్పటంలేదన్నారు. సమావేశంలో ఐద్వా జిల్లా నాయకులు ఎస్‌కె బషీర, సిఐటియు జిల్లా కార్యదర్శి పిసి కేశవరావు, మహిళా నాయకురాళ్లు కె ప్రసన్న, భానుమతి, ఎస్‌కె ఖాదర్‌మున్నీసాలు పాల్గొన్నారు.