Aug 02,2021 07:08

తిరువనంతపురం : మహిళలు, చిన్నారులపై నేరాలను నిరోధించడానికి కేరళలో 152 పంచాయతీల్లో క్రైమ్‌ మ్యాపింగ్‌ను ఈ నెలలో ప్రారంభించనున్నారు. 'కుటుంబశ్రీ' మహిళా సాధికారిత మిషన్‌ ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. రానున్న 5 ఏళ్లలో మహిళలపై నేరాలను కనీసం 25 శాతానికి తగ్గించే లక్ష్యంతో అన్ని స్థానిక సంస్థల్లో క్రైమ్‌ మ్యాపింగ్‌కు ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో రూ.20 కోట్లు కేటాయించారు. అందులో భాగం ముందుగా ఎంపిక చేసిన 152 పంచాయితీల్లో క్రైమ్‌ మ్యాపింగ్‌ చేపట్టనున్నారు. క్రైమ్‌ మ్యాపింగ్‌ టూల్స్‌తో నేరాల హట్‌ స్పాట్లు, నేరాల రకాలు, నేరాలకు దారితీసిన కారణాలను విశ్లేషణ చేయవచ్చని కుటుంబశ్రీ స్టేట్‌ ప్రొగ్రామర్‌ వి సింధూ తెలిపారు.