Nov 25,2022 23:36

మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర నాయకురాలు వివి జయ

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌:మహిళపై జరుగు తున్న హింసలను అరికట్టి హింస లేని సమాజాన్ని సృష్టిద్దామని ఐద్వా రాష్ట్ర నాయకురాలు వివి జయ పిలుపునిచ్చారు. హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని దండకారణ్య కళాశాలలో ఐద్వా ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఐద్వా ఆధ్వర్యంలో ఈ నెల 25 నుండి డిసెంబర్‌ 10 మానవహక్కుల దినోత్సవం వరకు 16 రోజుల పాటు హింసను అరికట్టి హింస లేని సమాజాన్ని సృష్టిద్దాం అనే నినాదంతో ఈ కార్యక్రమలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయ న్నారు. దీని అరికట్టడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విఫలం చెందుతున్నామని తెలిపారు. ఆడిపిల్లలకు విద్య, ఉద్యోగంలో సమాన వేతనాలు, సమానత్వం, మహిళలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, మగవారితో పాటు సమాన అవకాశాలు కల్పించక పోవడంతో అణిచివేతలకు గురై ఇబ్బందులు పడుతున్నారన్నారు.
అరకు సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ జీడి బాబు మాట్లాడుతూ, మద్యం, గంజాయి, మాదకద్రవ్యాలు, సామాజిక మాధ్యమాల ప్రభావం వెబ్‌ సైట్లు, సినిమాలు మహిళలపై హింసను ప్రెరేపించేవిగా ఉంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ కె రామకృష్ణ, వైన్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ చలపతి, కాలేజ్‌ చైర్మన్‌ బి.రాజారావు, వార్డు సభ్యులు అప్పలమ్మ, దండకారణ్య ప్రిన్సిపాల్‌ రాజు, అధ్యాపకులు ప్రసాద్‌, నిరేష్‌, సన్యాసమ్మ, నారాయణమ్మ తదితరలు పాల్గొన్నారు.
లైంగిక వేధింపులు అరికట్టాలి : హైమావతి
హుకుంపేట: మహిళలపై లైగింక వేధింపులు అరికట్టాలని మహిళ సంఘంం(ఐద్వా) జిల్లా నాయకురాలు సొంటేన హైమావతి డిమాండ్‌ చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఐద్వా ౖ 75 ఏళ్ల వజ్రోత్సవాలు జరుపు కున్నారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ, ప్రతీ ముగ్గురు మహిళల్లో ఒక మహిళ ప్రపంచంలో హింసకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యలు, అత్యాచారాలు, గృహ హింసలు దేశం, రాష్ట్రంలో రోజు, రోజుకు పెరుగుతున్నాయన్నారు. హింసను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయన్నారు. మహిళలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా సమాన అవకాశాలు కల్పించినప్పుడే హింసను అరికట్టడం సాధ్యమన్నారు. మహిళలు సంఘం చేసిన అనేక పోరాటాల ఫలితంగా పంచాయతీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ లలో రిజర్వేషన్‌లు సాధించడం జరిగిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు,కళాశాల ప్రిన్సిపాల్‌ కొట్టగుల్లి సింహా చలం నాయుడు, మెరకచింత మాజీ సర్పంచ్‌ లక్ష్మణ్‌రావు, మహిళ పోలీస్‌, అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి కిరణ్‌ పాల్గొన్నారు.