Nov 26,2022 00:03

మానవహారం చేస్తున్న విద్యార్థినులు

ప్రజాశక్తి-అనకాపల్లి
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని, ఇందు కోసం పకడ్బందీగా చట్టాలను అమలు పరచాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా అధ్యక్షురాలు పి.మాణిక్యం డిమాండ్‌ చేశారు. ప్రపంచ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన శుక్రవారం కళాశాల విద్యార్థినులు ర్యాలీ నిర్వహించి, స్థానిక నెహ్రూ చౌక్‌ జంక్షన్‌లో మానవహారం చేశారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 10 వరకు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా కార్య క్రమాలు నిర్వ హించడం జరుగుతుందని చెప్పారు. మహిళలపై జరుగుతున్న అత్యా చారాలను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యా యని విమర్శించారు. ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు సుభాషిణి మాట్లాడుతూ మహిళలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. మహిళలు నేడు అన్ని విధాలుగా అణగదొక్కబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గొర్లి తరుణ్‌, మౌనిక, పావని, అధిక సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.