
ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్ : ఆపద సమయాల్లో దిశాయాప్‌ను ఉపయోగించి పోలీస్ శాఖ సహాయం పొందవచ్చునని దిశా డిఎస్‌పి ఎస్‌ఆర్ హర్షిత అన్నారు. ఇది మహిళలకు దిశాయాప్ వజ్రాయుధం వంటిందని అన్నారు. ఈ మేరకు స్థానిక గాయత్రి కళాశాల విద్యార్థులకు దిశాయాప్‌పై అవగాహన కల్పించారు. దిశా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది, మహిళా పోలీసులతో కలిసి దిశా యాప్ రిజిస్ట్రేషన్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, వారి స్టేషను పరిధిలోని గల గ్రామాలు/వార్డు, ముఖ్య కూడళ్లు, విద్యా సంస్థలు, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, బస్టాండులు, రైల్వే స్టేషన్లు, హాస్పిటల్స్, పార్కులు, సినిమాహళ్లు తదితర చోట్ల చేపట్టారు. మహిళలపై లైంగిక వేధింపులు, అఘాయిత్యాలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేఖ దిశా యాప్‌ను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఈ యాప్‌ను ప్రతిఒక్కరి మొబైల్‌లో ఉండాలని, ఆపద సమయాల్లో ఉపయోగించి పోలీసుల సహకారం పొందాలని, దిశా యాప్ ప్రాధాన్యతను వివరించి, ఆపద సమయంలో యాప్ వినియోగించి ఏవిధంగా రక్షణ పొందవచ్చో కూడా వివరించి, వారి మొబైల్ ఫోన్లలో దిశా యాప్ డౌన్లోడ్, రిజిస్ట్రేషన్ చేయించారు. అలాగే ఈ యాప్ ద్వారా ఆపదలో ఉన్న ఎంతోమంది మహిళలను పోలీసులు రక్షించారని వివరించారు. కార్యక్రమంలో పాలకొండ డిఎస్పీ జివి కృష్ణారావు, ఎస్‌సి, ఎస్‌టి డిఎస్‌పి జి.మురళీధర్, జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్‌ఐలు సిబ్బంది, సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు..
పార్వతీపురం రూరల్ : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం టౌన్ ఎస్‌ఐ దినకర్ ఆధ్వర్యంలో విద్యార్థినిలకు దిశా యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 500మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ జ.రామారావు, మర్రాపు తాతబాబు, తెర్లి రవికుమార్, శ్రీధర్, సత్యనారాయణ, శ్రీనివాసరావు, శర్మ, రవి ప్రసాద్, శివ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
పాలకొండ : స్థానిక తమ్మినాయుడు, సత్యసాయి కళాశాలలో దిశ యాప్‌పై డిఎస్‌పి జివి కృష్ణారావు అవగాహన నిర్వహించి, విద్యార్థినులతో యాప్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిశా యాప్ వల్ల మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టాయని, యాప్‌పై అవగాహన పెంచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సిఐ మురళీధర్, ఎస్‌ఐ శివప్రసాద్ తదితరులు ఉన్నారు.
గుమ్మ లక్ష్మీపురం: మహిళలు దిశా యాప్ పట్ల అవగాహన కలిగి ఉండాలని ఎల్విన్‌పేట సిఐ సత్యనారాయణ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దిశాయాప్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అందరి చేత దిశా యాప్ తమ తమ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేయించి ఎలా వినియోగించాలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ షణ్ముఖ రావు, ప్రిన్సిపాల్ శ్రీ వరం ఉన్నారు.