Sep 04,2023 19:45

తోపుడు బండ్లు అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు పట్టణంలో కొనసాగిస్తున్న వరల్డ్‌ విజన్‌ ఇండియా అనే సంస్థ ఆధ్వర్యంలో లో సోమవారం ఏకలవ్య కాలనీ చెందిన కనపర్తి సుకన్య ,ఉప్పచెరువుకి చెందిన తమిదల స్రవంతి అను ఇద్దరు మహిళలకు వారి యెక్క కుటుంబ పోషణ వ్యాపార నిమిత్తం రెండు తోపుడు బండ్లు ఉచితగముగా సోమవారం ఇవ్వడం జరిగినది.ఈకార్యక్రమంలో వరల్డ్‌ విజన్‌ సంస్థ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ శామ్యూల్‌ రాజ్‌ మాట్లాడుతూ కందుకూరు మండలం పరిధిలో పట్టణ , గ్రామాల్లో వరల్డ్‌ విజన్‌ సంస్థ అద్వర్యం లో రెండు వేల మందికి పైగా చిన్నపిల్లలు దత్తత తీసుకొని వారికి యొక్క చదువుకోవడానికి హెల్ప్‌,ఆరోగ్య బాగలేనప్పుడు వారికి హెల్త్‌ సపోర్టు, ఎడ్యుకే మెటీరియల్‌ సపోర్ట్‌ , చేయడం జరుగుతుంది. అంతే అంతే కాకుకుండా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ప్రోగ్రాంస్‌ ,బాల్య వివాహాలు రూపు మాపడం కోసం అనేక అవగాహన కార్యక్రమాలు ప్రతి నెల కందుకూరు పరిధిలో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆని తెలియ జేశారు,ఈ కార్యక్రమంలో లో సంస్థ స్పాన్సర్‌ చైల్డ్‌ అఫిసర్‌,ఎమ్‌. ప్రసన్న లక్ష్మీ,ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ ఏండ్లూరి పుల్లయ్య,వాలంటీర్స్‌ బి.శివకష్ణ, కె.శ్రీదేవి,ఎల్‌ మమత పాల్గొన్నారు.