ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్:మహిళల్లో ఆర్థిక స్వావలంభనకు ఉపాధి కల్పిస్తున్నట్లు డిపిఎం సంజరు బాబు తెలిపారు. సోమవారం స్థానిక వెలుగు కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను, రుణాలను డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిరు వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు. చిరుధాన్యాలతో స్నాక్స్, చేగోడీ వంటి అనేక రకాలైన తినుబండారాలను తయారు చేసుకోవాలన్నారు. తృణధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలకు ఎంతో డిమాండ్ ఉందని, అందుకే స్త్రీ నిధి రుణం ద్వారా ఒక్కొక్క సభ్యురాలకు రూ.40 వేల చొప్పున అందిస్తున్నామన్నారు. డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫుడ్ కార్పొరేషన్ ప్రతినిధి సత్యనారాయణ, ఏపిఎం పార్వతి, వెలుగు సీసీలు తదితరులు పాల్గొన్నారు.










