Mar 08,2023 17:41

సమావేశంలో మాట్లాడుతున్న ఐద్వా జిల్లా అధ్యక్షురాలు టి. నిర్మల


మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి
- ఐద్వా జిల్లా అధ్యక్షురాలు టి.నిర్మల
ప్రజాశక్తి - నంద్యాల

      ఆకాశంలో సగం' 'అవనిలో సగం అన్నిటా సమాన అవకాశాలు మహిళలకు కావాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు టి. నిర్మల అన్నారు.బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా టి. నరసింహ్మయ్య భవనంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళా హక్కులు మహిళల రక్షణ అనే అంశంపై సదస్సును నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు టి. నిర్మల,సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ నాగరాజు పట్టణ అధ్యక్షులు డి. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు టి. నిర్మల మాట్లాడుతూ శ్రమ దోపిడీ వ్యతిరేకంగా,ముక్కలైన జీవితం కొరకు, ఓటు హక్కు కొరకు,పోరాడాల్సిన పరిస్థితి ఉందన్నారు. రోజు అన్నిటా కావాల్సిన మహిళలు వారి హక్కులు సాదించుకోవడం లో వెనుక ఉన్నారన్నారు. ప్రతి చోట మహిళలపై బాలికలపై లైంగిక దాడులు వివక్ష హింస పెరిగిపోతుందన్నారు.ఉపాధిలో 27.7 శాతం మాత్రమే మహిళలు ఉంటున్నారని, పని ప్రదేశాల్లో యజమానులతోటి  కార్మికులపైన వేధింపులు అఘైత్యాలు పెరిగిపోతున్నాయి అన్నారు. తక్కువ వేతనాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుంటూ మహిళల శ్రమను దోచుకుంటున్నారని ఆమె ఆవేదన చెందారు.వ్యవసాయ కార్మికులు పంట పొలాల్లో యాంత్రికరణ వల్ల పనులు లేక ఉపాధి పనులు ఎక్కువ రోజులు పెట్టకపోవడం వల్ల సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్లి ప్రమాణాల్లో చనిపోతున్నారని పని ప్రదేశాల్లో ఆసౌకర్యాల నడుమ బాధలు పడుతున్నారన్నారు. సనాతన ధర్మం పేరుతో, ఆడవారిని ఇంటిపట్టునే ఉండాలంటూ సుద్దులు చెప్పే వారు బయలుదేరారని విమర్శించారు.  ప్రభుత్వం మద్యం అమ్మకాలను పెద్దగా పరచి ప్రోత్సహించడం వల్ల భర్తలు మద్యానికి బానిసలై కుటుంబాలు చిన్నా భిన్నిమవుతూ మహిళలపై దాడులు పెరుగుతున్నాయని,బాల్య వివాహాలు పెరుగుతున్నాయని పార్లమెంటులో రాజ్యసభలో మహిళలకు సమభాగస్వామ్యం కల్పించాలని కనిసం 33 శాతం రిజర్వేషన్ కొరకు పోరాడుతున్నా పురుషాధిక్యత పార్టీలు చట్టరూపం కాకుండా అడ్డుకుంటున్నాయన్నారు . రాజకీయ ఆర్థిక ప్రజా జీవితంలో నిర్ణయాధికారము అని స్థాయిలో మహిళలకు సమభాగస్వామ్యం సమాన అవకాశాలు ఉండడం లేదు. కనీసం కుటుంబంలో సమభాగస్వామ్యము ఉండటం లేదు ఇంటి పనికి విలువ ఉండడంలేదన్నారు.ప్రస్తుత డిజిటల్ యుగంలో మహిళలు ఈ నైపుణ్యాలకు చాలా దూరంగా ఉన్నారు. ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, లింగ సమానత్వం కొరకు ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం (ఐద్వా) పోరాడుతున్నదని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళలు సేమేం,సుభద్రా, లలిత, ప్రేమ జ్యోతి,ఆశాజ్యోతి, ప్రశాంతి, వీరితోపాటు ఐదవ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.