Apr 20,2023 21:21

మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర నాయకురాలు కె. రంగమ్మ

మహిళలకు రక్షణ ఎక్కడ : ఐద్వా

ప్రజాశక్తి-ఆత్మకూరు

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించాలని దిశ యాప్‌ కింద కఠినంగా శిక్షించి మహిళలకు రక్షణ కల్పించాలని ఒకపక్క ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి చెపుతున్నప్పటికీ జూపాడు బంగ్లా మండలంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దౌర్జన్యాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనిఐద్వా రాష్ట్ర నాయకురాలు కె. రంగమ్మ, జిల్లా అధ్యక్షురాలు అమ్మ ఆర్‌.జయ మాధవి ప్రశ్నించారు.గత 15వ తారీఖున జూపా డుబంగా మండలం పార్మంచాల గ్రామంలో ఎం.లలితమ్మన్‌ పూర్తిగా మద్యం సేవించి చెప్పలేని విధంగా రాయలేని విధంగా దుర్భాషలాడి దాడికి ప్రయత్నంచిన మురారి, నవీన్‌,మురారి, రత్నమ్మ, సౌమ్య పై చట్టపరమైన కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడం ఏమిటని అన్నారు. జూపాడు బంగ్లా సెంటర్‌లో మదర్‌ బీనీ ఇంటిని కొచ్చి దుర్భాషలాడే మదర్‌ బి కూతురును భర్తను దౌర్జన్యంగా దాడి చేసిన వారిపై 16వ తారీఖు జూపాడు బంగ్లా మండల ఎస్‌ఐకి ఫిర్యాదు చేసినా ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా జూపాడు బంగ్లా మండల ఎస్‌ఐ వారు స్పందించి వీరిపై కేసు నమోదు చేయకపోతే మహిళా సంఘం, కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.