Dec 24,2022 23:27

మాట్లాడుతున్న ఐద్వా మండల అధ్యక్షులు కారం లక్ష్మి

ఐద్వా నాయకులు కారం లక్ష్మి, సున్నం పార్వతి
ప్రజాశక్తి-విఆర్‌.పురం

క్రిస్మస్‌, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని మండల వ్యాప్తంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యాన మహిళలకు ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, రేలా డ్యాన్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఐద్వా మండల అధ్యక్ష, కార్యదర్శి కారం లక్ష్మి, సున్నం పార్వతి తెలిపారు. వీటిల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాని జయప్రదం చేయాలని కోరారు. శనివారం రేఖపల్లిలో జరిగిన ఐద్వా ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, సమానత్వం, స్త్రీ విముక్తి లక్ష్యాలుగా ఏర్పడిన ఐద్వా నిత్యం మహిళల సమస్యలపై పోరాడుతుందని చెప్పారు. మహిళలపై జరుగుతున్న దాడులు, సాంఘిక దురాచారాలపై ఉద్యమిస్తుందన్నారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తుందని తెలిపారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, హక్కుల కోసం ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు ఎన్‌.అశ్విని, దారమ్మ, వెట్టి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.