Oct 07,2023 22:38

ప్రజాశక్తి మచిలీపట్నం రూరల్‌ : మచిలీపట్నం మండలం బొర్రపోతుపాలెం పంచాయతీ బైరాగిపాలెం బెరాకా మినిస్ట్రీస్‌ ఆడిటోరియంలో 40 మంది మహిళలకు స్వయం ఉపాధి నిమిత్తం రోటరీ వారి తో కలిసి 40 కుట్టు మిషన్లు శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి గా కష్ణా జిల్లా ఐసీడిఎస్‌ ప డి సువర్ణ కుమారి పాల్గొని మాట్లాడుతూ స్త్రీ శిశు సంక్షేమం కొరకు ప్రభుత్వంతో పాటు బెరాకా మినిస్ట్రీస్‌ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కొనియాడారు. ఈ స్వయం ఉపాధి కొరకు ఉచితంగా పంపిణీ చేయబడిన కుట్టు మిషన్లు తమ ఉపాధి కొరకు ఉయోగించుకోవాలి అని, అలాగే కుటుంబ అభ్యున్నతికి, తోడ్పడాలి అని అసించారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ కష్ణా జిల్లా చైర్‌ పర్శన్‌ సువార్త మాట్లాడుతూ సమాజంలో ఎంతో మంది ఒంటరి మహిళలు, జీవనోపాధి లేక, తమ పిల్లలను పోషించుకోలేక, చిన్న వయస్సులో పనులకు పంపడం, ఆడపిల్లకు బాల్య వివాహాలు చేయడం చేస్తూ వారి నిస్సహాయత వలన వారి బంగారు భవిష్యత్తును పాడు చేస్తున్నారు అని అన్నారు. ఆడపిల్లలకు 18 సం. నిండనిదే , మగ పిల్లలకు 21 సం నిండనిదే వివాహాలు చట్ట రీత్యా నేరం అని అన్నారు. డా.ధన్వంతరి ఆచారి, బెరాకా మినిస్ట్రీస్‌ అధినేత కిరణ్‌ పాల్‌, రోటరీ ప్రెసిడెంట్‌ లింగం మిసెస్‌ ,రోటరీ వైస్‌ గవర్నర్‌ జ్యోతి , కుమారి. అజ్మున్నీసా బేగం,ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ నాగిసెట్టి డానియల్‌ పాల్గొని ప్రసంగించారు.